“డియర్ కామ్రేడ్” మొదటి రోజు నైజాం కలెక్షన్స్.

Published on Jul 27, 2019 10:32 am IST

విజయ్ దేవరకొండ,, రష్మికా మందాన జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలలో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా డియర్ కామ్రేడ్ మూవీ డీసెంట్ నంబర్స్ నమోదు చేసింది.

ముఖ్యంగా డియర్ కామ్రేడ్ చిత్రం నైజాంలో మొదటి రోజు 2.73 కోట్ల షేర్ సాధించింది.మిగిలిన వారాంతపు సెలవులైన శని,ఆదివారాలలో కలెక్షన్స్ పెరిగే అవకాశం కలదు. ఐతే ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ నైజాం మొదటిరోజు షేర్ కంటే డియర్ కామ్రేడ్ వసూళ్లు తక్కువ కావడం గమనార్హం. ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజుకు గాను 3.25 కోట్ల షేర్ సాధించింది.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని నిర్మించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. శృతి రామచంద్రన్, చారుహాసన్ ముఖ్యపాత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం :