“డియర్ మేఘా” నాకు ఎంతో స్పెషల్… టీజర్ రిలీజ్ వేడుక లో మేఘా!

Published on Jul 22, 2021 6:04 pm IST


సుశాంత్ రెడ్డి దర్శకత్వం లో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం డియర్ మేఘా. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రం ను అర్జున్ దాస్యన్ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. అయితే ఈ వేడుక లో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేసింది. అయితే టీజర్ విడుదల చేయడం తో ఫీల్ గుడ్ మూవీ అని తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం తో అర్జున్ సోమయాజులు అనే మరో యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నట్లు నిర్మాత అన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ఆమని అనే పాట విడుదల చేశాం అని, ఒక మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి అని అన్నారు. కథ నచ్చి మూవీ చేశాం అని, త్వరలో థియేటర్ల లో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాం అని అన్నారు. ఈ సమయం లో థియేటర్లు తెరిచి ఎంకరేజ్ చేస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కి కృతజ్ఞతలు తెలిపారు.

డైరెక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ హృదయం లో నిలిచిపోయే సినిమా అని, మీ హార్ట్ ను టచ్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మేఘా ఆకాష్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని, అరుణ్ సినిమాను ఎంతో ప్రేమించాడు అంటూ చెప్పుకొచ్చారు. డియర్ మేఘా సినిమా తనకెంతో స్పెషల్ అంటూ మేఘా ఆకాష్ చెప్పుకొచ్చారు. తన పేరు తో ఈ చిత్రం వస్తుంది అని, డైరెక్టర్ మరియు హీరో లు తన పై నమ్మకం ఉంచి ఈ క్యారెక్టర్ ఆఫర్ చేశారు అని, వాళ్లకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

హీరో అరుణ్ మాట్లాడుతూ, వెబ్ సిరీస్ లు వచ్చాక బోల్డ్ కంటెంట్ చూపిస్తున్నారు అని, బ్యాడ్ వర్డ్స్ డైలాగ్స్ చెబుతున్నారు అని అన్నారు ఇవన్నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు అని, ఇలాంటి టైమ్ లో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ను డియర్ మేఘా తో చూపించే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. ప్యూర్ ప్రేమ కథ డియర్ మేఘా లో చూపించబోతున్నాం అని అన్నారు. అయితే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం హరిహర అందించారు.

సంబంధిత సమాచారం :