ముగ్గురు హీరోల మధ్య పోటీ తగ్గింది

Published on Nov 9, 2019 3:00 am IST

వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు పోటీ పడుతుండటంతో మీడియమ్ బడ్జెట్ సినిమాలు చాలా వరకు డిసెంబర్ నెలలో వచ్చేందుకు సిద్దయ్యాయి. వాటిలో సాయి తేజ్, మారుతిల ‘ప్రతిరోజూ పండగే’, బాలయ్య చేస్తున్న ‘రూలర్’ చిత్రాలతో పాటు రవితేజ యొక్క ‘డిస్కో రాజా’ కూడా ఉండేది. ఈ మూడు చిత్రాలను డిసెంబర్ 20న విడుదల చేయాలని ఆయా చిత్రాల నిర్మాతలు ముందుగా అనుకున్నారు. దీంతో మూడు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడినట్టైంది.

సాధారణంగా అయితే ఈ ముగ్గురు హీరోలకు సోలో రిలీజ్ దొరికితే మంచి ఓపెనింగ్స్ రాబడతారు. అయితే మూడూ సినిమాలు ఒకేరోజు వస్తుండే సరికి ఓపెనింగ్స్ తగ్గుతాయని అభిమానులు కొద్దిగా కంగారుపడ్డారు. కానీ ‘డిస్కో రాజా’ను డిసెంబర్ 20న కాకుండా జనవరి 24కు వాయిదా వేస్తూ నిర్మాతలు నిన్న ప్రకటించారు. దీంతో డిసెంబర్ 20న పోటీ సగం పోటీ తగ్గిపోయినట్టైంది. ‘రూలర్, ప్రతిరోజూ పండగే’ రెండు సినిమాలే కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో పోటీ పడే వాతావరణం తప్పింది.

సంబంధిత సమాచారం :