కరోనా బారినపడిన స్టార్ హీరోయిన్

Published on May 4, 2021 11:00 pm IST

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడ వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు నిత్యం ఎవరో ఒకరు కరోనాకు గురవుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. దీపికా నుండి ఇప్పటి వరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు కానీ ఆమె ఐసోలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే దీపికా, ఆమె భర్త రణ్వీర్ సింగ్ బెంగుళూరు వెళ్ళారు. ఆ తర్వాతనే ఆమెకు పాజిటీవ్ రిపోర్ట్స్ రావడం జరిగింది.

దీపికకే కాదు ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకింది. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనె, తల్లి ఉజ్జల, సోదరి అనీషా కూడ కరోనాకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇప్పటికే తల్లి, సోదరి డిశ్చార్జ్ కాగా దీపిక తండ్రి ప్రకాష్ కొలుకున్నారని త్వరలోనే ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారని తెలుస్తోంది. ఇకపోతే దీపిక పలు భారీ సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. వాటిలో ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కూడ ఉంది.

సంబంధిత సమాచారం :