వాయిదాపడిన ‘రంగస్థలం 1985’ ఫస్ట్ లుక్ !
Published on Dec 8, 2017 8:18 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం 1985’ ఫస్ట్ లుక్ ను ఈరోజు 8వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఈ విడుదలను కాస్త వాయిదా వేశారు. ముందుగా చెప్పినట్టు ఈరోజు కాకుండా రేపు 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ అంటూ నిర్మాణ సంస్త్ర్హ మైత్రి మూవీ మేకర్స్ కొత్త ప్రకటన చేసింది.

దీంతో అభిమానుల్లో కొంత నిరుత్సాహం ఎదురైనా కొత్త తేదీ పెద్ద దూరం లేకపోవడంతో సర్దుకుపోయారు. 1985 గ్రామీణ నైపథ్యంలో సాగనున్న ఈ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే ఒక వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

 
Like us on Facebook