‘తొలిప్రేమ’ ట్రైలర్ రిలీజ్ కావడం లేదు !

1st, February 2018 - 08:55:33 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ‘తొలిప్రేమ’ ముందు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు వెనక్కి వెళ్లి ఈ ఫిబ్రవరి నెల 10వ తేదీన రిలీజ్ కానున్న సంగతి విధితమే. అలాగే ఈరోజు చిత్ర యూనిట్ సినిమా యొక్క ట్రైలర్ ను ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని రెండు రోజుల క్రితమే తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ట్రైలర్ చెప్పిన సమయానికి విడుదలకావడంలేదని తెలుస్తోంది.

సాంకేతిక కారణాల వలనే ఈ ఆలస్యమని, ఇంకొద్దిసేపట్లో కొత్త అప్డేట్ ఇస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. వరుణ్ తేజ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన లభించడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.