ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేస్తున్న ఆఅంశం.

Published on Jul 5, 2020 11:04 pm IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. వారికి కావలసిన అప్డేట్ రాకపోవడమే ఇందుకు కారణం. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వస్తుందని భావించారు. ఐతే ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయడానికి తగినంత మెటీరియల్ లేదని, లాక్ డౌన్ కారణంగా షూట్ కూడా చేయలేకున్నాం అని, రాజమౌళి వివరణ ఇచ్చారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైతే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వస్తుందని అందరూ భావించారు.

కాగా ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ నుండి ఫస్ట్ లుక్ వీడియో వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీనికి కారణం కరోనా వైరస్. షూటింగ్స్ కి అనుమతి వచ్చినప్పటికీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్ మొదలుపెట్టలేదు. ఇక వేలల్లో నమోదవుతున్న కరోనా కేసుల కారణంగా షూటింగ్ ఇప్పట్లో జరగడం అసాధ్యం అంటున్నారు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటు కారణంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మరింత లేటవనుంది. ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా నిరాశకు గురిచేస్తుంది.

సంబంధిత సమాచారం :

More