నా పై ఎన్ని రూమర్స్ వచ్చినా సపోర్ట్ చేశారు – శ్రుతి హాసన్

నా పై ఎన్ని రూమర్స్ వచ్చినా సపోర్ట్ చేశారు – శ్రుతి హాసన్

Published on Dec 21, 2025 10:00 PM IST

Shruti Haasan 1

కమల్ హాసన్ కుమార్తెగా సినీ లోకానికి పరిచయమైంది శ్రుతి హాసన్. ఐతే, శ్రుతి హాసన్‌ కి గతంలో కొన్ని ప్రేమ కథలు ఉన్నాయి. ఆమె కొందరితో ప్రేమలో పడింది. తన లవ్‌స్టోరీలు ఇతరులకు సిల్లీగా అనిపించొచ్చని, కానీ తనకు అలా కాదని ఆ మధ్య ఓపెన్ గా కూడా చెప్పుకొచ్చింది. ఐతే, శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపింది. ఈ విషయం పై ఇంతకీ, శ్రుతి హాసన్ ఏం మాట్లాడింది అంటే..‘నాన్న నాకు ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. కానీ దాని వల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు’ అని ఆమె తెలిపింది.

శ్రుతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. వాటిల్లో అబద్దాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు. కానీ, నాన్న మాత్రం నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉన్నారు. ఇక నాకు తెలుసు, ఎంతోమందిలో మా నాన్న స్ఫూర్తిని నింపారు. అందుకే మా నాన్న అంటే నాకు ఎప్పటికీ అభిమానమే’ అని ఆమె చెప్పుకొచ్చింది. కమల్‌ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. తాను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సొంతంగా ఈ స్థాయికి వచ్చాను’ అంటూ శ్రుతి హాసన్‌ చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు