రిపోర్టర్ మధురవాణి పాత్రలో సమంత !

రిపోర్టర్ మధురవాణి పాత్రలో సమంత !

Published on Mar 21, 2018 1:01 PM IST

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సమంత రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రిపోర్టర్ మధురవాణి పాత్రలో సమంత నటించింది. సమంత చేసింది చిన్న పాత్రే అయినా సినిమాలో ఆ రోల్ కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. తాజాగా సమంత ఈ సినిమా కోసం తన పార్ట్ షూట్ ఫినిష్ చేసింది.

విజయ్ దేవరకొండ కూడ రిపోర్టర్ పాత్రలోనే కనిపించబోతున్నాడు ఈ మూవీలో. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుండగా మోహన్ బాబు, షాలిని పాండే, మాళవిక నాయర్ వంటివారు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు