రికార్డు ధరతో “దేవర” ఓటిటి హక్కులు?

రికార్డు ధరతో “దేవర” ఓటిటి హక్కులు?

Published on Jan 18, 2024 8:02 AM IST


గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఓటిటి హక్కులని అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మేకర్స్ కూడా అధికారికంగా అనౌన్స్ చేయగా ఇప్పుడు ఓ షాకింగ్ ఫిగర్ అయితే ఈ సినిమా విషయంలో వైరల్ గా మారింది.

ఈ సినిమా ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ వైరల్ గా మారింది. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా భాషల్లో ఓటిటి డీల్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు