లేటెస్ట్…దేవర పార్ట్ 1 గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

లేటెస్ట్…దేవర పార్ట్ 1 గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

Published on Jan 1, 2024 11:16 AM IST


గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ తో గ్లింప్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం జరిగింది. పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. గ్లింప్స్ వీడియో ను జనవరి 8 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు