మరో సినిమాను పూర్తిచేయనున్న విజయ్ దేవరకొండ !
Published on Jun 25, 2018 11:59 am IST

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ హీరో విజయ్ దేవరకొండ ఒకొక్క సినిమాను అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తిచేసే పనిలో ఉన్నారు. తమిళంలోకి ఆరంగేట్రం చేస్తూ అయన చేసిన చిత్రం ‘నోటా’. ‘ఇరుముగన్’ ఫేమ్ ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తిచేసుకోనుంది. దేవరకొండ కూడ ఈ సినిమాను ముగించడం కోసం ఈ మధ్య ఎక్కువ డేట్స్ ఆ చిత్రానికే కేటాయించి షూటింగ్లో పాల్గొన్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో మెహ్రీన్ కౌర్ కథానాయకిగా నటిస్తోంది. ఇది కాకుండా విజయ్ చేసిన ‘టాక్సీవాలా’ విడుదలకు రెడీగా ఉండగా ‘గీత గోవిందం’ అనే సినిమా కూడ చేస్తున్నారాయన.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook