“పుష్ప” విషయంలో దేవి నుంచి కొత్త కోణం.?

Published on Jul 7, 2020 9:08 pm IST

ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రాబోతున్న పలు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టు లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న”పుష్ప” చిత్రం కూడా ఒకటి.

భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అత్యున్నత ప్రామాణికలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి కూడా బన్నీ మరియు సుక్కుల హ్యాట్రిక్ కాంబో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయినప్పటికీ సుకుమార్ ఇతర ప్లానింగ్స్ ఏం పెట్టుకోకుండా సంగీత బాధ్యతలను దేవికి అప్పజెప్పడంతో దేవి క్యాపబలిటీకి ఈ చిత్రం ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు.

వీరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కానీ ఈసారి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో సినిమాకు ఏ రేంజ్ లో ఉండాలో అంతకు ఏమాత్రం తగ్గకుండా దేవీ జాగ్రత్తలు తీసుకొనున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులను కూడా స్టార్ట్ చేశారు. మరి దేవీ ఈ చిత్రానికి ఏ రేంజ్ గూస్ బంప్స్ తెప్పిస్తారో చూడాలి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More