టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “డెవిల్”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “డెవిల్”

Published on Feb 18, 2024 1:33 PM IST

టాలీవుడ్ హీరో, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిషేక్ నామా నిర్మాణం, దర్శకత్వం లో తెరకెక్కిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ డెవిల్. ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం మార్చ్ 10 వ తేదీన సాయంత్రం 6:00 గంటలకి ఈటీవీ లో ప్రసారం కానుంది. సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్, అజయ్, సత్య, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రల్లో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు