మహేష్ సాంగ్ విని సల్మాన్ అతనికి అవకాశం ఇచ్చాడట

Published on Mar 29, 2020 11:02 am IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీకి సాంగ్స్ అందించే బాధ్యత దేవిశ్రీకి దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుదేవ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా రాధే మూవీ తెరకెక్కుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది ఈద్ కానుకగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో సాంగ్స్ దేవిశ్రీ చేత చేయిద్దాం అని ప్రభుదేవా సల్మాన్ ఖాన్ కి సూచించాడట. ప్రభుదేవా, దేవిశ్రీ మహేష్ నటించిన మహర్షి సినిమా కొరకు స్వరపరిచిన చోటే చోటే భాతే.. సాంగ్ ని సల్మాన్ కి వినిపించిగా ఆయన కన్విన్స్ అయ్యాడట.

ఇక రాధే చిత్రంలో రెండు నుండి మూడు సాంగ్స్ దేవిశ్రీ కంపోజ్ చేసే అవకాశం కలదని టాక్. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాలకు దేవిశ్రీ, ప్రభుదేవా కలిసి పనిచేశారు. సల్మాన్ హిట్ మూవీ రెడీలో దింక చికా దింక చికా సాంగ్ ని దేవిశ్రీ కంపోజ్ చేయగా, సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది.

సంబంధిత సమాచారం :

X
More