దఢక్ వీక్ డేస్ లోకూడా బానే రాబడుతుంది !

దఢక్ వీక్ డేస్ లోకూడా బానే రాబడుతుంది !

Published on Jul 25, 2018 1:50 PM IST

dhadak2

లేడీ సూపర్ స్టార్ దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం’ దఢక్’ ఇటీవల విడుదలై మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగుండడం తో మొదటి మూడు రోజుల్లో రూ. 33. 61 కోట్ల వసూళ్లను రాబట్టి వీక్ డేస్ లోకి ఎంటర్ అయిన ఈచిత్రం సోమ వారం రోజు 5. 52కోట్లు అలాగే మంగళ వారం 4. 76 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫిస్ వద్ద సత్తా చాటుతుంది. ఇక 5 రోజులకుగాను ఈ చిత్రం 43. 95 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది .

మరాఠి భాషలో విజయం సాధించిన ‘సైరాత్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో ఇషాన్ కట్టర్ హీరో గా నటించాడు. ప్రముఖ నిర్మాతలు అపూర్వ మెహతా, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు