దంచికొడుతున్న “ధమాకా”..6 డేస్ వసూళ్లు.!

దంచికొడుతున్న “ధమాకా”..6 డేస్ వసూళ్లు.!

Published on Dec 29, 2022 10:06 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటెర్టైనర్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా వెళ్తున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు అయితే ఈ చిత్రం 6 రోజుల వసూళ్లు ఇప్పుడు మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

మరి ఐదు రోజుల్లో 49 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు 6 రోజులకి గాను 56 కోట్ల మాసివ్ మార్క్ ని ఈ చిత్రం అందుకుంది. దీనితో ఈ చిత్రంతో మాస్ మహారాజ్ తన కెరీర్ లో మరో 50 కోట్ల గ్రాస్ మార్క్ చిత్రాన్ని వేసుకున్నారు. ఈ వారం కూడా ధమాకా హవా కొనసాగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఫైనల్ రన్ లో ధమాకా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు