ధనుష్ నుండి మాత్రం ట్రీట్స్ అడగడం లేదు

Published on Apr 28, 2021 3:00 am IST

తమిళ హీరో ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరోలు ఎవరూ చూపని స్పీడ్ ధనుష్ చూపిస్తున్నారు. సినిమాలు చేయడంలోనే కాదు వాటిని విడుదల చేయడంలో కూడ ధనుష్ దూసుకుపోతున్నారు. థియేటర్లు అందుబాటులో ఉంటే వాటిలో లేకపోతే ఓటీటీల్లో సినిమాలు వదులుతున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేసిన ‘కర్ణన్’ చిత్రాన్ని 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆ చిత్రం మంచి ఫలితాన్ని అందుకుంది. వసూళ్లు కూడ బాగానే వచ్చాయి. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు మరిచిపోకముందే ఇంకొక సినిమాతో సందడి చేయనున్నారు ఆయన.

అదే ‘జగమే తంతిరం’. కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను జూన్ 18న నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు. తమిళ భాషలతో సహా ఇతర భాషల్లో కూడ చిత్రం రిలీజ్ కానుంది. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. భారీ వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉండనుంది. హీరోలంతా సైలెంట్ అయిపోయిన తరుణంలో ధనుష్ మాత్రం ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు అందుబాటులో ఉండటం అభినందించదగిన విషయమే.

సంబంధిత సమాచారం :