ధనుష్ కొత్త సినిమా రిలీజ్ డేట్!

dhanuSH
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరుగా చలామణీ అవుతూ వస్తోన్న ధనుష్, తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన ‘తొడరి’ అనే సినిమా తెలుగులో ‘రైల్’ అన్న టైటిల్‌తో డబ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్షన్స్‌నూ ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేసిన టీమ్, ఈ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేసి సెప్టెంబర్ 22న సినిమాను విడుదలకు సిద్ధం చేస్తోంది.

తమిళంలో దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. నేడు తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా, ఈ వారమే తెలుగు వర్షన్ సెన్సార్ కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. డి ఇమ్మాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈమధ్యే విడుదలైంది. నిర్మాతలు ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అందిస్తున్నారు.