రజనీకాంత్ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్న ధనుష్ ?

Published on Jan 23, 2020 2:25 pm IST

‘అసురన్, ఎన్నై నొక్కి పాయుమ్ తోట, పటాస్’ ఇలా వరుస సినిమాల్ని రిలీజ్ చేసిన ధనుష్ ఇంకో రెండు కొత్త సినిమాల్ని సీద్దం చేస్తున్నారు. వాటిలో కార్తిక్ సుబ్బరాజ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా మారి సెల్వరాజ్ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇక ధనుష్ చేయాలనుకుంటున్న కొత్త సినిమాల జాబితాలో ఆయన మామయ్య, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూడా ఉందని టాక్.

వివరాల్లోకి వెళితే రజనీ 1981లో చేసిన సూపర్ హిట్ మూవీ ‘నెట్రి కాన్’ సినిమాను ధనుష్ ఇప్పుడు రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రజనీ డబుల్ రోల్ చేశారు. ఈ రీమేక్లో కథానాయకిగా కీర్తి సురేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.
అపట్లో ఒరిజినల్ వెర్షన్లో నటించిన మేనక కీర్తి సురేష్ తల్లి కావడం విశేషం. అయితే ఈ రీమేక్ చిత్రానికి దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి వివారలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More