తమిళ రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ?

తమిళ రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ?

Published on Jun 2, 2026 10:11 AM IST

dhanush

తమిళనాడు రాజకీయాన్ని యాభై ఏళ్లుగా శాసిస్తున్న ద్రవిడ పార్టీలకు దళపతి విజయ్ గట్టి షాక్ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించి, సీఎం అయ్యారు. ఇదే స్ఫూర్తితో హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు ధనుష్. పైగా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. ఐతే, ధనుష్ భవిష్యత్తులో రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఉందంటూ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ధనుష్ తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. ఎవరికీ ప్రజలకు మంచి చేయాలని ఉంటుందో వారంతా రాజకీయాల్లోకి రావాలి. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టవచ్చు. నేనైతే రాను, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది. కానీ నా కొడుకులు (ధనుష్, సెల్వరాఘవన్) రావచ్చు కదా, అలాగే నా మనవళ్లు కూడా రావచ్చు’ అని కస్తూరి రాజా చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు