సూర్య ‘ఎన్ జికె’లో సాంగ్ పాడిన ప్రముఖ హీరో !

Published on Jul 16, 2018 9:23 pm IST

విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ఎన్ జికె. ఇక ఈ చిత్రంలో ప్రముఖ హీరో ధనుష్ ఒక సాంగ్ పాడారని తమిళ చిత్ర వర్గాలనుండి సమాచారం వస్తుంది. ఇంతకుముందు ధనుష్ ఆయన నటించిన ‘విఐపి’ తదితర చిత్రాల్లో తన గాత్రం తో ప్రేక్షకులను అక్కట్టుకున్నారు. మళ్ళి ఇప్పుడు తన అన్నయ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఒక గీతాన్ని ఆలపించారు.

రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు , ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More