లేటెస్ట్ : ధనుష్ ‘సార్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ : ధనుష్ ‘సార్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 6, 2023 8:14 PM IST

వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ సార్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ద్విభాషా మూవీగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ పై ధనుష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. అయితే విషయం ఏమిటంటే, సార్ మూవీ ట్రైలర్ ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కించారని, అలానే తప్పకుండా సార్ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీని ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు