మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో నటించనున్న ధనుష్?

మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో నటించనున్న ధనుష్?

Published on Oct 31, 2023 4:31 PM IST

Dhanush Ilaiyaraaja

కోలీవుడ్ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటులలో ధనుష్ ఒకరు. కెప్టెన్ మిల్లర్ చిత్రం తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అతని తదుపరి ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో పాత్రను ధనుష్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఆన్‌లైన్ లో పుకార్లు వస్తున్నాయి. ఈ చిత్రం 2024లో నిర్మాణం కానుంది అని, 2025లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Connekkt మీడియా ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి నటుడు, సంగీత దర్శకుడు లేదా నిర్మాణ సంస్థ అధికారికంగా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే, ఇది ధనుష్ యొక్క మొదటి బయోపిక్గా గుర్తించబడుతుంది. నటుడి వద్ద ఇంకా తేరే ఇష్క్ మే, డి 50, మరియు శేఖర్ కమ్ములతో ఒక తెలుగు సినిమా పూర్తి కావాల్సి ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు