ఆ దర్శకుడితో మరోసారి వర్క్ చేయాలనుకుంటున్న ధనుష్

Published on Feb 15, 2020 2:30 am IST

తమిళ హీరోలు ఒకసారి ఎవరైనా దర్శకుడిని నమ్మితే అతనితో తరచూ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ధనుష్ ఇలానే చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘కర్ణన్’ అనే సినిమా చేస్తున్నారు. సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ‘పెరియారుమ్ పెరుమాళ్’ చిత్రం నచ్చి అతనితో ఈ చిత్రం చేస్తున్న ధనుష్ అతని వర్కింగ్ స్టైల్ నచ్చి తర్వాతి చిత్రాన్ని కూడా అతనితోనే చేయాలని ఆశపడుతున్నారట.

ధనుష్ ఇంతలా ఇంప్రెస్ కావడానికి కథ, కథనాల పట్ల సెల్వరాజ్ రియలిస్టిక్ అప్రోచ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాదు బడ్జెట్ విషయంలో కూడా సెల్వరాజ్ చాలా పొదుపుగా ఉంటారట, వృధా ఖర్చు అస్సలు పెట్టారట. అందుకే అతనికి రెండో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చారు ధనుష్. ఇకపోతే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘కర్ణన్’ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :