హీరో ధనుష్ తప్పించుకోగా.. విజయ్ సేతుపతి ఇరుక్కుపోయాడు

Published on Oct 28, 2020 3:02 am IST


తమిళ సినీ పరిశ్రమలో ఈమధ్య బాగా వివాదాస్పదమైన అంశం బయోపిక్ ‘800’. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందాల్సిన ఈ బయోపిక్ మీద తమిళ జనం విపరీతమైన వ్యతిరేకత ప్రదర్శించారు. అందులో మురళీధరన్ పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి మీద నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేతుపతి ఆ బయోపిక్ చేయడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆ సినిమా చేయవద్దని సేతుపతికి సలహా ఇచ్చారు.

తీవ్ర పరిణామాల నడుమ మురళీధరన్ సూచనతో సేతుపతి ఆ బయోపిక్ నుండి బయటికొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఆస్తికకర విషయం బయటికొచ్చింది. అదేమిటంటే ‘800’ మేకర్స్ ముందుగా మురళీధరన్ పాత్రను చేయమని హీరో ధనుష్ వద్దకు వెళ్లారట. కానీ ధనుష్ మాత్రం సున్నితంగా చేయనని చెప్పడంతో వారు సేతుపతి సంప్రదించడం, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాతి పరిణామాలు తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో ధనుష్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆ బయోపిక్ చేస్తే ఇలాంటి వ్యతిరేకత వస్తుందని ముందుగానే ఊహించి ధనుష్ నో చెప్పాడని, అతనికి ముందుచూపుకు మెచ్చుకుని తీరాల్సిందేనని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More