నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ధనుష్ “సార్”

Published on Mar 19, 2023 10:38 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సార్. తమిళం లో వాతి పేరిట థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం తెలుగు, తమిళం లో మాత్రమే కాకుండా, హిందీ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రం విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మూడు బాషల్లో కూడా టాప్ లో ట్రెండ్ అవుతోంది. 1,2,4 స్థానాల్లో ఈ చిత్రం టాప్ లో ట్రెండ్ అవుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :