ధరమ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ లానే ఉంటాడట !


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్తగా సైన్ చేసిన చిత్రాల్లో కరుణాకరన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం గతంలో కరుణాకరన్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘తొలిప్రేమ’ ఛాయలతో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.

ఈ ఆసక్తిని ఇంకాస్త పెంచేలా చిత్రం మాత్రమే కాక అందులో ధరమ్ తేజ్ పాత్ర కూడా ‘తొలిప్రేమ’ లో పవన్ కళ్యాణ్ ను పోలి ఉంటుందని దర్శకుడు కరుణాకరన్ ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.