అక్కడ నాన్నని చూసిన ఆ హీరోకి నోరు పెగలలేదంట !

Published on Jul 18, 2019 10:44 am IST

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరో పరిచయమవుతున్న ఆదిత్య వర్మ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తెలుగు అర్జున్ రెడ్డి చిత్రానికి తమిళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఆదిత్య వర్మ ఎప్పుడో విడుదల కావాల్సి వుండగా అనేక కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. మొదట్లో బాల డైరెక్ట్ చేసిన సినిమా మొత్తాన్ని పక్కనబెట్టి గిరీశాయ డైరెక్షన్లో కొత్తగా చిత్రాన్ని మళ్ళీ షూట్ చేశారు. ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైయ్యాయి.

ఐతే హీరో ధృవ్ ఈచిత్రానికి డబ్బింగ్ చెవుతున్న సందర్భంలో డబ్బింగ్ థియేటర్ లోకి విక్రమ్ ప్రవేశించారట. సడన్ గా అక్కడ తండ్రిని చూసిన ధృవ్ సిగ్గుతో డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడటంతో పాటు, పనిలో నిమగ్నం కాలేకపోయారట. దీంతో ఆయనుంటే నేను డబ్బింగ్ చెప్పలేను అన్నాడట. ఈ పరిస్థితిని గమనించిన విక్రమ్ నన్ను ఓ తండ్రిలా కాకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ అనుకో అని నచ్చచెప్పారట. దాంతో ధృవ్ భయపడకుండా తన పనిని పూర్తిచేశారట.

సంబంధిత సమాచారం :

More