రామ్ చరణ్ ‘ధృవ’ అప్డేట్స్ !

dhruva
‘బ్రూస్ లీ’ చిత్రం తరువాత పెద్ద విరామం తీసుకున్న ‘రామ్ చరణ్’ ఎన్నో తర్జనభర్జనలు చేసి ఎట్టకేలకు చేస్తున్న సినిమా ‘తనీ ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధృవ’. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపటి నుండి మూడవ షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ సినిమా కోసం చెర్రీ బాగానే కష్టపడుతున్నాడు. కంప్లీట్ గా లుక్ మొత్తం మార్చేసి ఎక్కువ సమయం షూటింగ్ కే కేటాయిస్తున్నాడు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబందించి జరిగే అన్ని కార్యక్రమాల తేదీల్లో ఏదో ఒక విశేషం ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారట టీమ్. ముందుగా ఫస్ట్ లుక్ ను ‘స్వాతంత్ర్యదినోత్సవం’ ఆగష్టు 15 రోజున విడుదల చేస్తుండగా సాంగ్ టీజర్ ను ఆగష్టు 22న ‘చిరంజీవి’ పుట్టిన రోజునాటికి ఫిక్స్ చేశారట. అలాగే ఆడియో కార్యక్రమాన్ని ‘పవన్ కళ్యాణ్’ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న చేసి సినిమాను అక్టోబర్ 7 ‘దసరా’ రోజున విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్ బాగానే ఉన్నప్పటికీ చరణ్ టీమ్ ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘అల్లు అరవింద్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘అరవింద స్వామి’ విలన్ పాత్ర చేస్తుండగా ‘హిప్ హాఫ్ తమీజా’ సంగీతాన్ని అందిస్తున్నాడు.