
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్. దసరా కానుకగా ఈ రోజు రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ నందమూరి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ బాలయ్య కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని అభిమానులు ఫీలవుతున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర టీం దసరా సందర్భంగా ఒక వారం రోజులు బ్రేక్ ఇచ్చారు. దసరా హాలిడేస్ పూర్తవ్వడంతో ఈ చిత్ర టీం మళ్ళీ డిక్టేటర్ షూట్ ని మొదలు పెట్టారు.
ఈ రోజు నుంచి హైదరాబాద్ లోని నానక్రామ్ గూడాలో వేసిన హౌస్ సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. బాలయ్యతో పాటు అంజలి, పోసాని కృష్ణమురళి కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని నవంబర్ చివరికల్లా ఫినిష్ చేసి ఎలాంటి ఆటంకం లేకుండా 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సినిమాని రెడీ చేస్తున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథ అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు.

