
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. బాలకృష్ణని రెండు విభిన్న పాత్రల్లో చూపిస్తూ చేస్తున్న ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శ్రీవాస్. దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ని ఈ రోజు ఉదయం లాంచ్ చేసారు. నందమూరి అభిమానులు బాలయ్యని ఎలా కోరుకుంటారో అలానే ఈ టీజర్ ని రిలీజ్ చేయడంతో అభిమానులకు ఈ టీజర్ బాగా నచ్చేసింది. అలాగే సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ తో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుందని టీజర్ చెప్పకనే చెబుతోంది.
అలాగే ఈ టీజర్ బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ – ‘రేయ్ నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే ఓ హిస్టరీ ఉంది’, ‘మద్యం ఆరోగ్యానికి హానికరం, నాలాంటోన్ని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం’. ఈ రెండు డైలాగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే సినిమా రిలీజ్ విషయంలో అందరి అనుమానాలను చెరిపేస్తూ సంక్రాంతి కానుకగానే రిలీజ్ చేయనున్నాం అని ఈ చిత్ర టీం అధికారికంగా ఈ టీజర్లో తెలిపింది. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథ అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు.
టిజేర్ కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

