నిఖిల్ ’18 పేజెస్’లో డిఫరెంట్ పాయింట్ !

నిఖిల్ ’18 పేజెస్’లో డిఫరెంట్ పాయింట్ !

Published on Oct 19, 2020 5:17 PM IST

టాలెంటెడ్ హీరో నిఖిల్ సినిమా అంటేనే ఏదోక కొత్త పాయింట్ ఉంటుందనే ముద్ర ఉంది ఇండస్ట్రీలో. కాగా నిఖిల్.. తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని.. హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ మెమరీ లాస్ కంటే కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని.. ఈ సినిమా థీమ్ కూడా డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

నవంబర్ 20 నుండి షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్ మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేయనున్న ‘కార్తికేయ 2’ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు