డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “దేవర”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “దేవర”

Published on Jan 15, 2024 10:02 AM IST

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం ను ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన గ్లింప్స్ వీడియో ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. ఈ వీడియో సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.

అయితే ఈ సినిమా కి సంబందించిన డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దియెట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు