భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న దిల్ బేచారా ట్రైలర్.

Published on Jul 7, 2020 8:35 am IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం దిల్ బేచారా. ఈ చిత్ర ట్రైలర్ నిన్న విడుదలై సంచలనంగా మారింది. విడుదలై 24 గంటలు కూడా గడవక ముందే 20 మిలియన్ వ్యూస్ దాటి వేసింది. అలాగే ఈ ట్రైలర్ కి 4.2 మిలియన్ లైక్స్ రావడం మరో రికార్డ్. తమ అభిమాన హీరో నటించిన చివరి చిత్రం కావడంతో ట్రైలర్ ని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ సుశాంత్ పై తమ ప్రేమ చాటుకుంటున్నారు. దిల్ బేచారా ట్రైలర్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక దిల్ బేచారా ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెలుస్తుంది. కాన్సర్ తో బాధపడుతున్న అమ్మాయి ప్రేమలో పడే యంగ్ ఫెలో గా సుశాంత్ పాత్ర ఉంది. సుశాంత్ మరణం తరువాత వస్తున్న ఈ చిత్రం ఆయన జీవితంలో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోతుందనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని జులై 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు. సంజన సంగీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ముఖేష్ చబ్రా దర్శకుడు కాగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

దిల్ బేచారా ట్రైలర్ ఇక్కడ చూడండి

సంబంధిత సమాచారం :

More