“అవెంజర్స్”ను దాటి వరల్డ్ రికార్డ్ సృష్టించిన సుశాంత్ సింగ్ చివరి సినిమా.!

Published on Jul 7, 2020 4:06 pm IST

నో డౌటెడ్ గా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలని మన ఇండియన్ ఫిల్మ్ లవర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. సుశాంత్ సింగ్ అకాల మరణం ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతోంది.

దీనితో సుశాంత్ నటించిన చివరి చిత్రం “దిల్ బెచారా” సినిమాను ఒక మెమొరబుల్ సినిమాగా నిలపాలని అంతా భావిస్తున్నారు. “ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్” అనే బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా ముఖేష్ ఛాబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ నిన్ననే విడుదలై యూననిమాస్ రెస్పాన్స్ ను అందుకుంది.

ఎంతలా అంటే ఒక్క ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ సినిమాలోనే హై యెస్ట్ లైక్డ్ ట్రైలర్ గా ఇది నిలిచింది. ప్రపంచంలో హై యెస్ట్ గ్రాసర్స్ లో ఒకటైన “అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు 3.6 మిలియన్ లైక్స్ రికార్డును ఎప్పుడో దాటేసి ఇప్పుడు 5 మిలియన్ లైక్స్ ను దాటి 6 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. ఈ చిత్రం వచ్చే జూలై 24 న డిజిటల్ ప్రీమియర్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

సంబంధిత సమాచారం :

More