ఇష్క్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా – దిల్ రాజు

ఇష్క్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా – దిల్ రాజు

Published on Jul 26, 2021 7:53 PM IST

యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ఇష్క్‌. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌ కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు.

ఈ వేడుక లో వాకాడ అప్పారావు మాట్లాడుతూ, ఈ క‌రోనా క‌ష్ట‌కాలాన్ని అధిగ‌మించి ఈ నెల 30న థియేట‌ర్స్ ఓపెన్ చేస్తున్నారు అని, అందులో భాగంగా ఇష్క్ సినిమా రిలీజ్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దిల్‌రాజుగారితో మాకు ఎప్ప‌టినుండో మంచి అభిన‌వ‌ భావ సంబంధాలు ఉన్నాయి అని తెలిపారు. ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం ఆనందంగా ఉంది అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే చిన్న ఇన్స్‌డెంట్‌ని ఆధారం చేసుకుని తీసిన స‌బ్జెక్ట్ ఇది అని, ఇలాంటి స‌బ్జెక్ట్స్‌తో సినిమా తీయ‌డానికి చాలా గ‌ట్స్ కావాలి అని, హీరో హీరోయిన్లు చ‌క్క‌గా న‌టించారు అని అన్నారు. టెక్నీషియ‌న్స్ మంచి స‌పోర్ట్ అందించారు, సినిమా చాలా బాగా వ‌చ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను పాత్రికేయులు బాగా ప్ర‌మోట్ చేయాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ, మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన దిల్‌రాజు గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు, రాజుగారి బ్యాన‌ర్‌లో ఆరేడు సంవ‌త్స‌రాల‌ నుండి వ‌ర్క్ చేస్తున్నాను. ఆయ‌న ద‌గ్గ‌రి నుండి చాలా విష‌యాలు నేర్చుకోవ‌డం జ‌రిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను ఆ స్టేజ్‌మీద ఉండ‌డానికి చేయూత‌నిచ్చింది దిల్‌ రాజు గారే అని అన్నారు. క‌రోనా త‌ర్వాత థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డం అందులో ఒక తెలుగు సినిమా విడుద‌ల‌వుతుండ‌డం చాలా సంతోషం అని అన్నారు. మ‌నం అంద‌రం తెలుగు సినిమాల‌ని ఆద‌రించి మ‌ళ్లీ తెలుగు సినిమాకి పున‌ర్వైభ‌వం తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇష్క్‌ ఒక కొత్త క‌థ‌ అని, సినిమా చూసిన వాళ్లు త‌ప్ప‌కుండా థ్రిల్ ఫీలవుతారు అని అన్నారు.

హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మాట్లాడుతూ, ఇది తెలుగులో నా సెకండ్ ప్రాజెక్ట్‌, క‌రోనా త‌ర్వాత న‌న్ను నేను మ‌రోసారి బిగ్‌స్క్రీన్ మీద చూసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్యూ దిల్‌ రాజు గారు ఫ‌ర్ గ్రేసింగ్ ద ఈవెంట్‌ అంటూ చెప్పుకొచ్చారు. తన మీద న‌మ్మ‌కంతో ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు అని అన్నారు. ఎస్ ఎస్ రాజుగారు ఫంటాస్టిక్ డైరెక్ట‌ర్, షూటింగ్ స‌మ‌యంలో చాలా హెల్ప్ చేశారు, థియేట‌ర్స్‌ లో మా ఇష్క్ సినిమాను చూసి స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరో తేజ స‌జ్జ మాట్లాడుతూ, జులై30న థియేట‌ర్స్‌లో మా ఇష్క్ సినిమా విడుద‌ల‌వుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్ తో వస్తోంది అని తెలిపారు. ఎడ్జ్ఆఫ్ ది సీట్ థ్రిల్ల‌ర్ సబ్జెక్ట్‌ అని, ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ వ‌ర‌కు నెక్ట్స్ ఏం జ‌రుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అని, తెలుగులో ఇలాంటి స‌బ్జెక్ట్ ఇంత‌వ‌ర‌కూ రాలేదు అని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. సాగ‌ర్ మ‌హ‌తి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా న‌చ్చితే న‌లుగురికి చెప్పండి ఇలాంటి కొత్త‌ర‌కం సినిమాల‌ను ఎంక‌రేజ్ చేసిన వాళ్లు అవుతారు అని అన్నారు. సినిమా రెడీ అయ్యాక కూడా థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేద్దాం అని ఇన్ని రోజులు హోల్డ్ చేసిన మా నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌ అని అన్నారు. నా ఫ‌స్ట్ సినిమాకి దిల్‌రాజుగారే మాట్లాడి నాకు అవ‌కాశం ఇప్పించారు అని, ఇప్పుడు థియేట‌ర్స్‌ని స‌పోర్ట్ చేయ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చారు అని, మంచి సినిమాల‌కు దిల్‌రాజుగారి స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, గ‌తేడాది నుండి కరోనా ప్ర‌భావం అన్ని ఇండ‌స్ట్రీల‌ మీద ప‌డింది, ఫిలిం ఇండ‌స్ట్రీ మీద ఇంకా ఎక్కువ ప‌డింది, మూడు నెల‌ల త‌ర్వాత ఈ నెల 30న విడుద‌ల‌య్యే రెండు సినిమాలు స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ పాండ‌మిక్‌ని గుర్తుపెట్టుకుని ప్రేక్ష‌కులు కూడా త‌ప్ప‌కుండా మాస్కులు వేసుకునే సినిమా చూడాలని కోరుకుంటున్నాను అని సూచించారు. నా బిగినింగ్ డేస్ లో డిస్ట్రిబ్యూట‌ర్‌గా నేను నిల‌బ‌డ‌డానికి సూప‌ర్ గుడ్ ఫిలింస్ ఎన్వీ ప్ర‌సాద్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌, పార‌స్ జైన్ గారు చేసిన హెల్ప్ మ‌రియు వాళ్లు ప్రోత్సహించిన విధానం కాని, నేను డిస్ట్రిబ్యూట‌ర్‌గా స‌క్సెస్ అయిన త‌ర్వాత ఆర్‌.బి. చౌదరి గారు త‌మిళంనుండి చాలా సినిమాలు చేసేవారు అని అన్నారు. వారికి 90 శాతం స‌క్సెస్ రేట్ ఉండేది కాబ‌ట్టి వారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అని చాలా స్ట‌డీ చేసేవాన్ని అంటూ చెప్పుకొచ్చారు. రామానాయుడుగారు, ఆర్ బి చౌదరి గారు ఇలా ఎవ‌రెవ‌రు క‌థ‌ల మీద మంచి గ్రిప్ ఉన్న ప్రొడ్యూస‌ర్స్ అని స్ట‌డీ చేసే నా ప్ర‌తి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను అని, అలాంటి సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో వ‌స్తోన్న ఇష్క్ సినిమా ఈ నెల 30న విడుద‌ల‌వుతుంది అని, మంచి కంటెంట్ కాబ‌ట్టి రిజ‌ల్ట్ కూడా బాగా వ‌స్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను అని అన్నారు. నాగ‌రాజు నాతో శ‌త‌మానం భ‌వ‌తి, ఎంసిఎ సినిమాల‌కు వ‌ర్క్ చేశారు, మంచి సెన్సిబిలిటీ ఉన్న ప‌ర్స‌న్, చాలా మంచి సినిమాల‌కు వ‌ర్క్ చేశారు, ఆ ఎక్స్‌పీరియ‌ర్స్ త‌న మొద‌టి సినిమాకు త‌ప్ప‌కుండా ఉప‌యోగ‌ప‌డుతుంది అని అన్నారు. తేజ‌, ప్రియా న్యూ జెన‌రేష‌న్‌. తేజ చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ఓ బేబి, జాంబీరెడ్డి సినిమాల‌లో చాలా మెచ్యూర్డ్‌గా పెర్‌ఫామ్ చేస్తున్నాడు అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియా రాత్రికి రాత్రే వ‌రల్డ్ మొత్తాన్ని సోష‌ల్‌ మీడియాలో షేక్ చేసింది అని అన్నారు. వీరిద్ద‌రికీ ఆల్ ది బెస్ట్‌, మంచి సినిమా కాబట్టి త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు