మహర్షి విడుదల తేదీ ఫై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు !

Published on Jan 22, 2019 4:52 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న25వ చిత్రం ‘మహర్షి’ విడుదలై తేదీ ఫై ఇటీవల రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విడుదల తేదీ ఫై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 25న ఈచిత్రాన్ని విడుదలచేయనున్నామని ఆయన కొద్దీ సేపటి క్రితం తెలియజేశారు. అయితే ఈ చిత్ర టీజర్ మహాశివరాత్రి కానుకగా మార్చి 4న విడుదలకానుందని వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More