‘బలగం’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు వేణు యెల్డండి. త్వరలో తన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ పై ఆయన ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమా గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది, ఎందుకంటే హీరోహీరోయిన్ల పేర్లు మారుతున్నాయి. వేర్వేరు సమయాల్లో, నాని, నితిన్, కీర్తి సురేష్ మరియు సాయి పల్లవి ఇలా ఈ సినిమాలో చాలామంది పేర్లు వినిపించాయి. మొత్తానికి నటీనటుల ఎంపికకు టీమ్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయమే తీసుకుంది.
కాగా ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తారనే చర్చ జరుగుతోంది, కానీ, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఐతే, దిల్ రాజు తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన 10 రోజుల్లో వస్తోందని క్లారిటీ ఇచ్చారు. పైగా ఈ చిత్రాన్ని 2026 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడా ? లేదా ? అనేది చూడాలి.


