మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన చిత్రం ’96’. ఇటీవల విడుదలైన ఈచిత్రం మంచి రివ్యూస్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది . ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేయనున్నారని తెలిసిందే.
తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనెర్ ను తెరకెక్కించేందుకు దర్శకుడు దొరికాడని సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కడం దాపుగా ఖరరైపోయిందని అంటున్నారు. ఇక హరీష్, దిల్ రాజు నిర్మాణంలో’ దాగుడుమూతలు’ అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాల్సి వుంది. ఎందుకనో ఈ సినిమా ఫై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక దిల్ రాజు ఆ సినిమా బదులు హరీష్ కు ఈ రీమేక్ చిత్రానికి అవకాశం ఇచ్చాడని సమాచారం. ఇక ఈచిత్రంలో నాని , సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నింటిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


