దిల్ రాజు ఫోకస్ అంత ఇప్పుడు ఆ చిత్రం పైనే !

Published on Jul 21, 2018 4:27 pm IST

దిల్ రాజు బ్యానర్లో అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించిన చిత్రం ‘లవర్’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం మిక్సడ్ రివ్యూస్ను సొంతం చేసుకోవడంతో దిల్ రాజు ఇక తన ఫోకస్ అంత అయన నిర్మిస్తున్న’శ్రీనివాస కళ్యాణం’ ఫై పెట్టారు. ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. దాంట్లో భాగంగా రేపు ఈచిత్రం యొక్క ఆడియో ను విడుదల చేయడంతో పాటు టీజర్ ను కూడా ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

యువ హీరో నితిన్ నటిస్తున్న ఈచిత్రాన్ని ‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం ఆగష్టు 9వ తేదీన విడుదలకానుంది. ఇక ‘లై , చల్ మోహన్’ రంగ చిత్రాలతో వరుస పరాజయాలను చవిచూసిన నితిన్ ఈచిత్రం ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :