‘ఓకే బంగారం’ మ్యాజిక్‌పై కన్నేసిన దిల్‌రాజు!
Published on Nov 13, 2016 3:11 pm IST

duet
మణిరత్నం సినిమాలంటే, ఏళ్ళు గడిచినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేంత క్లాసిక్స్‌ అన్న పేరుంది. ఇండియన్ సినిమాకు గర్వ కారణంగా నిలిచిన దర్శకుల్లో ఒకరైన ఆయన, కొద్దికాలంగా ఓ సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూడగా, ‘ఓకే బంగారం’తో అది నెరవేరింది. ఇక ఆ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన తన కొత్త సినిమా ‘కాట్రు వెళదిలై’ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కార్తీ, అదితిరావు హైదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామా మార్చి నెలలో విడుదలవుతుందని మణిరత్నం స్పష్టం చేశారు.

ఇక మణిరత్నం ఓకే బంగారంను తెలుగులో విడుదల చేసిన నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా తెలుగు హక్కులను కూడా సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఓకే బంగారం సక్సెస్‌లో దిల్‌రాజుది కూడా కీలక పాత్ర కావడంతో, ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా ఆయనైతే బాగా ప్రమోట్ చేస్తారని మణిరత్నం వెంటనే తెలుగు వర్షన్ హక్కులు అమ్మేశారట. తెలుగులో ‘డ్యూయేట్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఓకే బంగారం తరహాలానే మణిరత్నం-దిల్‌రాజు కాంబినేషన్‌లో డ్యూయేట్ మరో హిట్‌గా నిలుస్తుందన్న ప్రచారం ఇప్పట్నుంచే మొదలైంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook