‘శతమానం భవతి’ లో దిల్ రాజు గెస్ట్ అప్పియరెన్స్ ?

3rd, January 2017 - 06:50:17 PM

shatamanam
ఈ సంక్రాంతికి రిలీజవుతున్న సినిమాల్లో ‘శతమానం భవతి’ కూడా ఒకటి. రెండు భర్తీ సినిమాలతో రిలీజవుతుండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. పైగా నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను కుటుంబ విలువలతో చాలా గొప్పగా నిర్మించారని కూడా తెలుస్తోంది. ఇకపోతే తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ ను బాగా గమనిస్తే అందులో ఒక గుడి సన్నివేశంలో హీరో శర్వానంద్ తో పాటు పల్లకి మోస్తూ దిల్ రాజు కూడా దర్శనమిచ్చాడు.

దీన్నీ చూసిన తరువాత మొదటి నుండి ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకమైంది అని పలు సందర్భాల్లో చెప్పిన మాటలు గుర్తుకు రాక మానవు. దిల్ రాజు అంటున్న ఆ ప్రత్యేకత ఈ సినిమాలో ఆయన చేసిన గెస్ట్ రోలేనా అని సందేహం వస్తోంది. పైగా ట్రైలర్ లో కనిపించిన అయన సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదు కూడా. మరి మనం అనుకున్నట్టు దిల్ రాజు తెరపై కాసేపు కనిపిస్తాడా లేక ట్రైలర్లోని ఫ్రేమ్ వరకే పరిమిమయ్యారా అనేది జనవరి 14వ తేదీన తెలుస్తుంది.