ఆ విషయంలో దిల్ రాజు హార్ట్ అయ్యాడట !

Published on Aug 6, 2018 3:16 pm IST

నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఇప్పటికే ఈ చిత్రం పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలైన ఈ చిత్ర ఆడియో కూడా బాగుండటంతో, నితిన్ రాశి ఖన్నాల మధ్య కెమిస్ట్రీ బాగుటుందని టాక్ రావడంతో ‘శ్రీనివాస కళ్యాణం’కు మంచి బజ్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సంధర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో దిల్ రాజ్ ఓ విషయంలో బాగా హార్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

వివరాల్లోకి వెళ్తే ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం చిత్రీకరణ కూడా దిల్ రాజే చూసుకుంటున్నారని ఒక రకంగా ఈ చిత్రం ఆయనకు డెబ్యూ డైరెక్టర్‌గా మొదటి సినిమా అంటూ ఆ మధ్య కొన్ని కథనాలు వచ్చాయట. ఆ కథనాలకి బాగా హర్టయ్యా. అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఇవి దర్శకుల చిత్రాలు. నేనెప్పుడు దర్శకులకు సపోర్ట్‌ మాత్రమే ఇస్తాను తప్ప, డైరెక్షన్ లో మాత్రం జోక్యం చేసుకోనని దిల్ రాజు తెలిపారు. ప్రకాష్ రాజ్ ,నందిత శ్వేతా, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More