వినాయక్, దిల్ రాజుల కథ.. డెస్టినీ అంటే ఇదేనేమో !

Published on Oct 9, 2019 11:05 pm IST

ఇండస్ట్రీలో టాప్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా మారిన దిల్ రాజు ప్రస్థానం మొదలైంది ‘దిల్’ సినిమాతోనే. ఆ హిట్ సినిమా మూలంగానే ఒట్టి రాజు కాస్త దిల్ రాజు అయ్యారు. ‘దిల్’ సినిమాకి దర్శకుడు వి.వి.వినాయక్. ఆ సినిమాతో ఏర్పడిన వారి బాండింగ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ముఖ్యంగా దిల్ రాజుకు తన మొదటి సినిమానే హిట్ చేసి తనకు సూపర్ స్టార్ట్ ఇచ్చిన వినాయక్ అంటే మరీ అభిమానం.

ఆ అభిమానాన్ని వినాయక్ ను ఎకంగా హీరోని చేసి చాటుకున్నారు. తన దగ్గరకు వచ్చిన కథకు వినాయక్ అయితే బాగుంటాడని నమ్మి ఆయన్ను ఒప్పించి హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేలా చేశాడు. వినాయక్ సైతం దిల్ రాజు ప్రోత్సాహంతో
అన్ని విధాలా కష్టపడి హీరోగా మారిపోయారు. మొత్తానికి నిర్మాతగా తన మొదటి సినిమాను చేసిన దర్శకుడ్ని దిల్ రాజు ఈరోజు హీరోని చేస్తున్నారు. బహుశా డెస్టినీ అంటే ఇదేనేమో.

ఇకపోతే వీరి చిత్రం ‘సీనయ్య’ ఈరోజే లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రాన్ని ఎన్.నరసింహ డైరెక్ట్ చేయనుండగా మణిశర్మ సంగీతం అందివ్వనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొడలుకానుంది.

సంబంధిత సమాచారం :

X
More