నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్న దిల్ రాజు !

Published on Jan 31, 2019 5:32 pm IST

దిల్ రాజు నిర్మాణంలో ‘జోష్’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని నాగచైతన్య. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అప్పటికే వరుస హిట్స్ తో స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజూకి తొలి పరాజయాన్ని రుచి చూపించింది జోష్ సినిమా. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ నుండి మొన్న ‘ఎఫ్ 2’ వరకూ ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.

అయితే తనని నమ్మి నాగచైతన్య ఎంట్రీని తన చేతుల్లో పెట్టిన నాగార్జున నమ్మకాన్ని మాత్రం దిల్ రాజు అప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైనా చైతుకి తమ బ్యానర్ లో ఓ మంచి సినిమా ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకున్నాడట. మొత్తానికి శశి అనే ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ చైతుకి బాగుంటుందని దిల్ రాజు , నాగ చైతన్యతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సారైన దిల్ రాజు నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

ఇక ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘స‌వ్య‌సాచి’ పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద చైతు మార్కెట్ కాస్త డల్ అయింది. నాగచైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తోన్నాడు.

సంబంధిత సమాచారం :

X
More