వకీల్ సాబ్ లీకులపై దిల్ రాజు ఫైర్..!

Published on Jul 2, 2020 11:14 pm IST

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తీవ్ర అసహనంలో ఉన్నారు. ఆయన నిర్మిస్తున్న దాదాపు నాలుగు ప్రాజెక్ట్స్ కరోనా కారణంగా హోల్డ్ లో ఉన్నాయి. ఆయన భారీగా పెట్టుబడి పెట్టిన వకీల్ సాబ్, నాని నటించిన వి చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ఉండిపోయాయి. థియేటర్స్ ఓపెన్ అయితే ముందు నాని నటించిన వి మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భారీగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా…థియేటర్స్ తెరుచుకోవడం అటుంచితే వకీల్ సాబ్ షూటింగ్ కూడా జరిగే పరిస్థితి లేదు.

దీనికి తోడు వకీల్ సాబ్ నుండి కొన్ని లీకులు బయటికి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం వకీల్ సాబ్ మూవీలో పవన్ లాయర్ లుక్ బయటికి వచ్చింది. కోర్టులో ఆయన వాదిస్తున్న సన్నివేశానికి సంబందించిన వర్కింగ్ స్టిల్ అది. ఇలా వకీల్ సాబ్ నుండి లీకు బయటికి రావడం దిల్ రాజును మరింత ఇబ్బందిపెడుతుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

More