హిందీ “డీజే” కోసం దిల్ రాజు గట్టి ప్లాన్స్..?

Published on Jul 10, 2020 7:07 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ హిట్ చిత్రం “దువ్వాడ జగన్నాథం”(డీజే). ఈ చిత్రానికి ఒక్క బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా టెలివిజన్ స్క్రీన్ సహా బాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు హిందీలో కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దిల్ రాజు గట్టి ప్లాన్సే చేస్తున్నారని బజ్ వినిపిస్తుంది. దిల్ రాజు అక్కడ బి ఆర్ చోప్రా ప్రొడక్షన్స్ వారితో కలిసి నిర్మించనున్నారని తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రానికి హీరో రేస్ లో అక్కడి యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ మరియు వరుణ్ ధావన్ ల పేర్లు రేస్ లో ఉన్నాయని తెలుస్తుంది. వీటి అన్నిటి కన్నా దిల్ రాజు ఈ చిత్రం సోల్ మిస్సవ్వకూడదని అక్కడ కూడా దర్శకుడు హరీష్ శంకర్ తోనే తీయనున్నారు అని మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More