దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయనున్న మెగా హీరో !

16th, April 2017 - 11:27:55 AM


మెగా హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ త్వరలో మరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. అలాగే ‘శతమానం భవతి’ చిత్రంతో సంక్రాంతి సక్సెస్ ను అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ‘జవాన్’ సెట్స్ లో ధరమ్ తేజ్ ను కలిసిన దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను అక్కడే ఫైనల్ చేశారట.

ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుందట. అయితే ఈ ప్రాజెక్ట్ విషయమై ధరమ్ తేజ్ నుండి గాని, దిల్ రాజు నుండి గాని ఇంకా అధికారిక సమాచారం బయటకు వెలువడలేదు. గతంలో దిల్ రాజు, తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం’ చిత్రాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇకపొతే ప్రస్తుతం తేజ్ బివిఎస్ఎస్ రవి దర్సకతవరంలో ‘జవాన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.