న్యుమోనియాతో బాధపడుతున్న దిలీప్‌ కుమార్‌ !

న్యుమోనియాతో బాధపడుతున్న దిలీప్‌ కుమార్‌ !

Published on Oct 9, 2018 3:04 AM IST

Dilip Kumar

అలనాటి దిగ్గజ బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయన గత కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. అయితే ఆదివారం రాత్రి ఆయనకు తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్ తరలించారని సమాచారం.

అయితే కుటుంబ సభ్యుల నుండి ఇంకా ఎటువంటి వివరణ లేదు. దిలీప్‌ కుమార్‌ సన్నిహితుడు అయిన ఫైసల్‌ ఫరూఖి ట్వీటర్ ద్వారా స్పందిస్తూ.. దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యం పై వస్తోన్న వార్తల్లో చాలా వరకు వదంతులేనని పోస్ట్ చేశారు. కాగా 1944లో జ్వర్‌ భటా సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన దిలీప్‌ కుమార్‌ తన కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన చివరిసారిగా 1998లో ఖిలా చిత్రంలో నటించారు.

తాజా వార్తలు